తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక తెలంగాణలో బీజేపీ- జనసేన మధ్య పొత్తు ఎట్టకేలకు ఖరారైంది. పవన్ పార్టీకి 11 స్థానాలను కమలం పార్టీ కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించారు. అనేక తర్జనభర్జనల మధ్య చివరకు బీజేపీ జనసేనకు కేటాయించే సీట్లను ప్రకటించింది. అయితే రెండు పార్టీల నుంచి పొత్తులు, సీట్లపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
జనసేనకు కేటాయించిన సీట్లు
కూకట్ పల్లి
శేరిలిగంపల్లి
నాంపల్లి
మల్కాజిగిరి
తాండూరు
కోదాడ-
నాగర్ కర్నూల్-
ఖమ్మం-
కొత్తగూడెం-
వైరా
అశ్వరావుపేట
ఇక బీజేపీ ఇప్పటికే మూడు విడదల్లో 88 మంది అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో 52, మలి విడతలో ఒక్కరికి, మూడో లిస్టులో 35 మందికి స్థానం కల్పించారు. ఈసారి ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మిపురి అర్వింద్ బరిలో నిలుస్తుండగా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. ఆయన తని సిట్టింగ్ స్థానమైన హుజారాబాద్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ పోటీ చేసే మరో స్థానమైన కామారెడ్డికి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక ఇప్పటికే 88 అభ్యర్థులను ప్రకటించగా.., ప్రస్తుతం జనసేనకు 11 సీట్లు కేటాయించారు. దీంతో మెుత్తం 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మెుత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గానూ మిగిలిన 20 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ కసరత్తు పూర్తి చేసి అభ్యర్థులను ప్రకటించేందుకు కమలం పార్టీ కసరత్తు చేస్తోంది.
0 Comments