కడుపున పుట్టిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవలసిన తల్లి అమానవీయంగా ప్రవర్తించింది. అమ్మతనానికి మచ్చ తెచ్చిన తల్లి చేసిన దారుణ ఘటన సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. ఇక ఈ ఘటన ఎక్కడో మారుమూల ఎలాంటి సంస్కృతి తెలియని, నాగరికత నేర్చుకోని సమాజంలో జరగలేదు. నాగరికత ఉన్న, అన్నీ తెలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ భర్త 2007వ సంవత్సరంలో చనిపోయాడు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. దీంతో వీరిని పోషించడం భారంగా మారిన సదరు యువతి పుట్ట సతీష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది.
అయితే కొన్ని సంవత్సరాల తర్వాత సదరు వ్యక్తి తనకు పిల్లలు కావాలని, లేదంటే మరో పెళ్లి చేసుకుంటానని భార్యను బెదిరించడంతో తనకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో ఆ తల్లి ఎవరు చేయకూడని పని చేసింది.ఎనిమిదో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెతో బలవంతంగా రెండో భర్తతో కాపురం చేయించింది. కుమార్తె గర్భవతి కాగా ఆమెకు ఆడపిల్ల జన్మించింది. ఇక ఆ పాపను తనకు పుట్టిన పాపగా బర్త్ సర్టిఫికెట్ తీసుకుంది. ఇక ఆడపిల్ల పుట్టడంతో సతీష్ మగపిల్లాడు కావాలని అనడంతో రెండవ కుమార్తెను కూడా తన రెండో భర్త దగ్గరకు పంపించింది. దీంతో గర్భం దాల్చిన కూతురు మృత శిశువుకు జన్మ ఇవ్వడంతో, ఆ మృత శిశువును పారేసి, ఈ విషయం బయటకు రాకూడదని కూతుళ్లు ఇద్దరికీ జాగ్రత్త చెప్పింది.అయితే ఇటీవల సతీష్ కు, ఈ పిల్లల తల్లికి మధ్య గొడవలు జరగడంతో తన మేనమామకు చిన్న కూతురు ఇంట్లో జరుగుతున్న దారుణాలను వివరించి చెప్పింది. తనపై తండ్రి వరుసకు ఉన్న వ్యక్తి చేస్తున్న దారుణాలను చెప్పింది. దీంతో మేనమామ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కసాయి తల్లితో పాటు రెండవ భర్తను కూడా అరెస్ట్ చేశారు. AD ప్రస్తుతం మళ్లీ కుమార్తెలు ఇద్దరు గర్భవతులుగా ఉన్నారని, వీరిద్దరిని సంరక్షణ కేంద్రానికి తరలించినట్టు గా తెలుస్తుంది. ఇద్దరు బాలికలు మైనర్లు కావడంతో పోక్సో చట్టం కింద దిశ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. ఇక ఈ ఉదంతం తెలిసిన వారంతా ఛీ ఈమె కూడా ఒక తల్లేనా అంటూ ఆ తల్లిని తిట్టి పోస్తున్నారు.
0 Comments